జైల్ అదాలత్ ద్వారా ఖైదీలకు సత్వర న్యాయం

28-11-2026 | 09:50pm

సిద్దిపేట క్రైం: ఖైదీలకు సత్వర న్యాయం అందించడానికి జైల్ అదాలత్ లు ఉపయోగపడతాయని హుస్నాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి.రేవతి పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శనివారం సిద్దిపేట జిల్లా జైలులో జైల్ అదాలత్ నిర్వహించారు.  జడ్జి రేవతి జిల్లా పరిధిలోని మొత్తం 12 కేసులను పరిష్కరించారు. ఈ అదాలత్ ద్వారా ఖైదీలకు న్యాయపరమైన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్సు కౌన్సెల్స్ ఎం.రవికుమార్, డి.రవీందర్, జైలు పర్యవేక్షణాధికారి జి.రత్నం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు