జాతీయస్థాయికి నిర్మల్ విద్యార్థులు
నిర్మల్ నవంబర్ 28 ( విజయక్రాంతి) : జిల్లాకు చెందిన ఏడుగురు క్రీడాకారులు జాతీయ స్థాయి సబ్-జూనియర్ వుషు ఛాంపియన్షిప్ పోటీలకు(National-level Sub-Junior Wushu Championship competitions) ఎంపికయ్యారు. వారిని జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా(District Collector Bhavish Mishra) ప్రత్యేకంగా అభినందించారు. ఒడిశా రాష్ట్రం(State of Odisha) భువనేశ్వర్‌లోని 'కిట్' యూనివర్సిటీ క్యాంపస్('KIIT' University campus) లోని బిజు పట్నాయక్ ఇండోర్ స్టేడియంలో(Biju Patnaik Indoor Stadium) 26వ సబ్-జూనియర్ నేషనల్ వుషు ఛాంపియన్షిప్ పోటీల్లో వీరు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.
సోలంకే సాక్షి (32 కిలోల విభాగం), వాగ్మారే కరణ్ (36 కిలోల విభాగం), అబ్దుల్ రహమాన్ (26 కిలోల విభాగం), శ్రీరాముల ప్రణీల్ రాజ్ (24 కిలోల విభాగం) బంగారు పతకాలు కైవసం చేసుకున్నారు. 14 సంవత్సరాల లోపు విభాగంలో మాడేకర్ ప్రణీత, అనుష్క సాయినాథ్ కొంకుల్వార్ (42 కిలోల విభాగం), సట్లా హర్షవర్ధిని (48 కిలోల విభాగం) బంగారు పతకాలు సాధించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రామారావు పటేల్ జిల్లా క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు