అయ్యప్ప ఆలయానికి బోర్ వేయించిన ముచ్చర్ల కుటుంబం

28-11-2026 | 09:50pm

విజయ క్రాంతి /మూసాపేట్: మూసాపేట మండల(Moosapet Mandal) కేంద్రం లో గల సంకల్ప సిద్ది  హరిహర అయ్యప్ప క్షేత్రానికి సరఫరా అయ్యే తాగు నీటి బోరులో(Drinking water borehole) గత వారం నుండి నీళ్లు అడుగంటి పోయాయి .దీంతో ఆలయంలో నీటి కొరత ఏర్పడడంతో సంకల్ప సిద్ధి అయ్యప్ప సేవా సమితి సభ్యులు ముచ్చర్ల కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు స్పందించి కీర్తి:శే ముచ్చర్ల లక్ష్మయ్య కళావతమ్మ ,ముచ్చర్ల భరతులు సరోజమ్మ జ్ఞాపకార్థం వారి కుమారులు ముచ్చర్ల శ్రీనివాసులు, యాదయ్యలు కలసి కొత్తగా బోరును వేయించి శనివారము మోటర్ బిగించి తాగునీరు ఇచ్చి భక్తులకు దాహం తీర్చారు.

ముచ్చర్ల కుటుంబ సభ్యులకు సంకల్ప సిద్ది అయ్యప్ప సేవా సమితి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గురు స్వాములు నల్ల తిరుపతయ్య గౌడ్ ,కొంగరి శ్రీనివాసులు, విశ్వేశ్ ,కొండయ్య, సభ్యులు యాదయ్య, శ్రీనివాసులు ,శేఖర్, అయ్యప్ప స్వాములు ,సేవా సమితి సభ్యులు ఉన్నారు.

మరిన్ని వార్తలు