హాజరు శాతం తక్కువ ఉన్న ఉపాధ్యాయులకు షోకాజు నోటీసులు
భద్రాద్రి కొత్తగూడెం, నవంబర్ 17 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District)లో ప్రభుత్వ పాఠశాలల్లో అక్టోబర్ నెలలో విద్యార్థుల శాతం తక్కువగా ఉన్న 37 మంది ప్రధానోపాధ్యాయులకు జిల్లా వైద్యశాఖ అధికారి శంభు ప్రసాద్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం 50% కన్నా తక్కువ వున్న 37 మంది ప్రధానోపాధ్యాయులకు విద్యార్థుల శాతం ఎందుకు తక్కువగా ఉన్నదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. విద్యార్థుల తల్లిదండ్రులు, కమ్యూనిటీ సహాయంతో విద్యార్థులు రోజు బడికి వచ్చేలా చూడాలని ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు. విద్యార్థుల హాజరు శాతం పెంచడానికి ఏఏ చర్యలు తీసుకుంటున్నారో తెలియజేస్తూ వివరణ ఇవ్వాల్సిందిగా పేర్కొన్నారు.