అక్రమ ఇంటి నిర్మాణాన్ని తొలగించాలి
- ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
- సామాజిక కార్యకర్త బానోత్ హరి
చుంచుపల్లి,నవంబర్ 16 (విజయ క్రాంతి ): చుంచుపల్లి మండలం, ఏజెన్సీ 1/70 యాక్ట్(Agency 1/70 Act) పరిధిలోని ప్రశాంతినగర్ గ్రామపంచాయితీని (Prashantinagar Gram Panchayat) ఆనుకుని, సింగరేణి వర్క్ షాపు రామవరం వెనుక గల సుమారు 800 చదరపు గజముల ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని కొందరు గిరిజనేతరులైన వ్యక్తులు అక్రమంగా దురాక్రమణ చేసి, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి,
ఇంటి నిర్మాణం చేసిన నేపధ్యంలో, అట్టి స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకొని కాపాడాలని తేది.20-03-2026న జిల్లా కలెక్టర్ కి, ఐటీడీఏ పీవో కి ఫిర్యాదు చేయగా, ఏజెన్సీ ఏరియాలోని అట్టి అక్రమ నిర్మాణంపై ఎల్ టి ఆర్ కేసు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్, మరియు ఐటీడీఏ పీవో లు తెలియజేసియున్నారు.
ఐటీడీఏ పీవో చుంచుపల్లి తహసీల్దార్ ని మరియు కొత్తగూడెం మండల తహసీల్దార్ ని నివేదక కోరగా చుంచుపల్లి తహశీల్దార్ ఇది కొత్తగూడెం మున్సిపల్ పరిదిలో వున్నదని నివేదిక ఇచ్చారు. అదేవిధంగా, కొత్తగూడెం తహశీల్దార్ గత వారం క్రితం సర్వేయర్ తో స్థల పరిశీలన చేసిన అనంతరం ఈ స్థలం ప్రభుత్వ స్థలం అని కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో వున్నదని ప్రైవేటు వ్యక్తులది కాదని స్పష్టంగా తెలియజేసినారు.
నిజానికి, రామవరం, ప్రశాంతి నగర్ గ్రామపంచాయితీ మొదలైనవి ఏజెన్సీ 1/70 యాక్ట్ పరిధిలో వున్నవి. పై అధికారులు తెలిపిన విధంగా ఇది ప్రభుత్వ భూమి అని, ఇతరులు ఎవరైనా కబ్జా చేస్తే వారిపై LTR కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలియజేసినారు.
కావున, పై విషయాన్ని పరిశీలించి, ఏజెన్సీ 1/70 యాక్ట్ పరిధిలోని ప్రశాంతినగర్ గ్రామపంచాయితీలో గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తూ, తప్పుడు పత్రాలను సృష్టించి, ప్రభుత్వ ఖాళీ స్థలాన్ని దురాక్రమణ చేసి,
ఇంటి నిర్మాణం చేసినందున సదరు గిరిజనేతరులైన వ్యక్తులపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకుని, అక్రమ ఇంటి నిర్మాణాన్ని తొలగించి, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా నుండి స్వాధీనం చేసుకోవాలి సామాజిక కార్యకర్త హరి అన్నారు