ఫిర్యాదులు లేక వెలవెలబోయిన ప్రజావాణి
జన్నారం, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో(Jannaram Mandal Headquarters) ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి(Public service program) ప్రజల నుంచి స్పందన కరువైంది. సోమవారం జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ భవనంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదుదారులు లేక వెలవెలబోయింది.
తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో కార్యాలయంలో బోసిపోయిన వాతావరణం కనిపించింది. మరోవైపు ప్రజావాణి కార్యక్రమానికి కొందరు అధికారులు గైర్హాజరు కావడం కూడా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించాల్సిన కార్యక్రమానికి అధికారులే హాజరుకాకపోవడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమంపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.