అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలి
ఎమ్మెల్యే పాయల్ శంకర్
బేల, నవంబర్ 16 (విజయక్రాంతి): పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) సూచించారు. సోమవారం బేల మండల కేంద్రంలో నిర్వహించిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మండలంలోని 476 మంది లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భాగ్యలక్ష్మి దేవన్న, మార్కెట్ కమిటీ ఛైర్మన్లు శ్రీకాంత్ రెడ్డి, అశోక్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.