హీరో తేజ సజ్జా ఎంగేజ్‌మెంట్.. హాజరైన స్టార్ హీరోలు

16-11-2026 | 04:34pm

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా(Tollywood young hero Teja Sajja) జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. 'హనుమాన్' సినిమాతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థ(Engagement) వేడుక ఘనంగా జరిగింది.

ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తరలివచ్చారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావుతో పాటు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), రవితేజ, నాని, రానా, దర్శకుడు రాఘవేంద్రరావు, ప్రశాంత్ వర్మ తదితరులు హాజరై కాబోయే దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వేడుకకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.

వచ్చే డిసెంబర్‌లో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్ వేడుకగా పెళ్లి నిర్వహించి, అనంతరం హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, స్నేహితుల కోసం ప్రత్యేక రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే కాబోయే వధువు వివరాలను కుటుంబం గోప్యంగా ఉంచింది. ఇక సినిమాల విషయానికొస్తే.. 'హనుమాన్', 'మిరాయ్' విజయాలతో మంచి జోష్‌లో ఉన్న తేజ సజ్జా, త్వరలో 'జాంబిరెడ్డి' సీక్వెల్‌తో పాటు 'హనుమాన్' సీక్వెల్‌లోనూ ప్రేక్షకులను అలరించనున్నారు.

మరిన్ని వార్తలు