శ్రీ చక్రేశ్వర శివాలయ భోజనశాల నిర్మాణానికి విరాళం

16-11-2026 | 04:38pm

బోధన్, నవంబర్ 16 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ చక్రేశ్వర శివాలయ(Sri Chakreshwara Shiva Temple) అభివృద్ధికి దాతలు తమ వంతు సహకారం అందిస్తున్నారు. ఆలయ ఆవరణలో ఉన్న భోజనశాల పైకప్పు శిథిలావస్థకు చేరుకోవడంతో పాత పైకప్పును తొలగించి, కొత్తగా రేకుల షెడ్డు ఏర్పాటు చేసేందుకు దాతలు ముందుకు వచ్చారు.

ఈ నేపథ్యంలో శివ దీక్ష సేవాసమితికి చెందిన శివస్వాములు భోజనశాలపై కొత్త రేకుల షెడ్డు నిర్మాణం కోసం రూ.75 వేల విరాళాన్ని ఆలయ ఛైర్మన్ లక్ష్మణ్ పటేల్‌కు అందజేశారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో దాతల సహకారం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు మహేశ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు