నిర్మానుష్యంగా మారిన వరంగల్ మార్కెట్
మంగళవారం మార్కెట్ పునః ప్రారంభం
వరంగల్, నవంబర్ 16 (విజయక్రాంతి): వరంగల్ వ్యవసాయ మార్కెట్లో(Warangal Agricultural Market) అడ్తి సెక్షన్ అధ్యక్షుడు లింగారెడ్డి పై నమోదు చేసిన కేసు, ఇతర అంశాలపై వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద(District Collector Dr. Satya Sharada) సమక్షంలో నిర్వహించిన సమావేశంలో చర్చించడం జరిగిందని, రైతు ప్రయోజనాలను కాపాడేందుకు మార్కెట్లో సామరస్య పూర్వక వాతావరణాన్ని ఏర్పరచాలని కలెక్టర్ చేసిన సూచన మేరకు మంగళవారం నుండి వరంగల్ ఏనుమాముల మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు ప్రారంభించనున్నట్లు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటించింది
. నాలుగు రోజుల క్రితం జరిగిన సంఘటన నేపథ్యంలో వ్యాపారులు మార్కెట్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం మార్కెట్ కు వ్యవసాయ ఉత్పత్తులు విక్రయానికి రాలేదు. మార్కెట్ యార్డులో బందు వాతావరణం కొనసాగింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ తో జరిగిన సమావేశం అనంతరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రకటన నేపథ్యంలో మంగళవారం నుండి వ్యవసాయ మార్కెట్లో యధావిధిగా కొనుగోలు నిర్వహించడానికి మార్గం సుగమమయ్యింది.