జాతీయ బీసీ సంక్షేమ సంఘం
మహాదేవపూర్ నవంబర్ 16(విజయక్రాంతి ): జాతీయ బీసీ సంక్షేమ సంఘం(National BC Welfare Association) జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉపాధ్యక్షులుగా పిడుగు బాపును నియమిస్తూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బుట్టి శ్యామ్ యాదవ్ సంయుక్తంగా నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ సందర్భంగా పిడుగు బాపు మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి జిల్లా అధ్యక్షులు బుట్టి శ్యామ్ యాదవ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.తన నియామకానికి సహకరించిన జిల్లా ఇన్‌చార్జి విజయగిరి సమ్మయ్య, జిల్లా అధ్యక్షులు రవికుమార్,
వర్కింగ్ ప్రెసిడెంట్ బత్తిని శివశంకర్, అమృత అశోక్, ప్రధాన కార్యదర్శులు ఎల్లస్వామిలకు బాపు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు బొమ్మ రంజిత్, యువజన సంఘం అధ్యక్షులు ఏకాంబరం చిరంజీవి పాల్గొని పిడుగు బాపుకు నియామక పత్రాన్ని అందజేశారు. బీసీల సంక్షేమం, హక్కుల సాధన, సామాజిక న్యాయం కోసం తనకు అప్పగించిన బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తానని పిడుగు బాపు తెలిపారు.