యువత నృత్య ప్రతిభకు సువర్ణావకాశం

07-11-2026 | 10:34pm
  1. డ్యాన్స్ పోటీల పోస్టర్ ఆవిష్కరణ
  2. జేబీపీ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ 

చుంచుపల్లి,నవంబర్ 7(విజయక్రాంతి ) :  డ్యాన్స్ పోటీలు(Dance competitions) యువత లోని ప్రతిభకు సువర్ణావకాశం అని జైభీమ్ రావ్ భారత్ పార్టీ(Jai Bhim Rao Bharat Party) (జేబీపీ) స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ యెర్రా కామేష్ అన్నారు.శనివారం భద్రాద్రి ఫిలింఛాంబర్ ఆధ్వర్యంలో ఈ నెల 14 మరియు 15 వ  తేదీల్లో కొత్తగూడెం సిఈఆర్ క్లబ్ నందు జరగనున్న రెండు తెలుగు రాష్ట్రాల డ్యాన్స్ పోటీల పోస్టర్(Poster for dance competitions in the Telugu states) ను ఆవిష్కరించిన కామేష్ మాట్లాడుతూ చదువుతో పాటు కళలు,నృత్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాల్లో యువత రాణించడం ఎంతో అవసరమని, కళాకారులను ప్రోత్సహించేందుకు ఇలాంటి పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు.

సబ్ జూనియర్స్,జూనియర్స్,సీనియర్స్ విభాగాలలో సోలో మరియు గ్రూప్ డ్యాన్స్ పోటీలు ఉంటాయని పోటీల్లో గెలుపొందిన విజేతలకు మొమెంటో తో పాటు సర్టిఫికెట్ ప్రదానం చేయడం జరుగుతుందని ప్రతీ ఒక కళాకారుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డ్యాన్స్ మాస్టర్,పోటీల నిర్వాహకుడు ప్రభు రాజ్,రవికుమార్,యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు మాలోత్ రాజా,కార్తిక్,వినయ్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు