ఘనంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు
చుంచుపల్లి, నవంబర్ 14(విజయక్రాంతి ) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను(National Library Week Celebrations) చాచా నెహ్రూ జయంతి(Chacha Nehru's Birth Anniversary), బాలల దినోత్సవం(Children's Day) సందర్భంగా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్(Kothagudem Mayor Mood Ganesh) ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన చేసి వారోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 27వ వార్డు కార్పొరేటర్ మద్దల హరిత, గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, కార్యదర్శి కె. కరుణ కుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు, గాన కార్యక్రమాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మద్దల సరిత, గ్రేడ్-2 గ్రంథపాలకురాలు ఎస్. లలిత కుమారి, జి. మణి మృదుల, శాఖా గ్రంథపాలకులు సీహెచ్. శ్రీనివాస్, నాగన్న, రవి, మధుబాబు, వాణి, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.