ఉద్యోగుల సమ్మె విరమణ
నిర్మల్ నవంబర్ 14 ( విజయక్రాంతి) : నేషనల్ హెల్త్ మిషన్(National Health Mission) లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె 32 రోజుల అనంతరం ముగిసినట్టు తెలిపారు. ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం ఆరోగ్య శాఖ కార్యదర్శి చర్చల ద్వారా స్పష్టమైన హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్టు వారు తెలిపారు. స్థానిక ఆర్డిఓ కార్యాలయం(Local RDO Office) ఎదుట జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజేందర్ కు సమ్మె విరమణ పత్రాన్ని అందజేసి సన్మానం చేశారు.
సోమవారం నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు విధుల్లో చేరుతున్నామని వారు ప్రకటించారు. తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీ నెరవేర్చని పక్షంలో మళ్లీ సమ్మె చేస్తామని వారు తెలిపారు. సమ్మెకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు రమణ నారాయణ శోభ సుజాత తదితరులు పాల్గొన్నారు