శ్రీశనేశ్వరస్వామికి తిల తైలాభిషేకాలు

14-11-2026 | 05:39pm

బిజినేపల్లి, నవంబర్ 14 : మండలంలోని నంది వడ్డేమాన్  శ్రీ శనేశ్వర స్వామికి(Sri Shaneshwara Swamy at Nandi Vaddeman) భక్తులచే(devotees) శని గ్రహదోష నివారణ కోసం తిల తైలాభిషేకాలు వేద మంత్రోచ్ఛారణల మధ్య భక్తి శ్రద్ధలతో(devotional) జరిగాయి. శనివారం ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి చేత భక్తులకు(devotees) శని గ్రహ దోష నివారణ పూజలతో పాటు పరమ శివునికి భక్తులచే రుద్రాభిషేకాలు, అర్చనలు, దీపారాధన, నందీశ్వర స్వామి  ప్రత్యేక అర్చన పూజలు నిర్వహించారు.

అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెల్దండ గోపాల్ రావు, గ్రామ సర్పంచ్ టి.సుగుణమ్మ, కమిటీ సభ్యులు, ఆర్చకులు శాంతి కుమార్, ఉమా మహేశ్వర్, భక్తులు, మహిళలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు