రాహుల్ పర్యటన ఎఫెక్ట్.. బీజేపీ నేతల ముందస్తు అరెస్ట్

14-11-2026 | 05:38pm

సుల్తానాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలానికి చెందిన పలువురు బీజేపీ నాయకులను పోలీసులు శనివారం ముందస్తుగా అరెస్ట్ చేశారు. మండల బీజేపీ అధ్యక్షుడు కందుల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొల్లూరి సంతోష్ కుమార్, యువ మోర్చా అధ్యక్షుడు కొమ్మిడి రాజేందర్ రెడ్డి, ఎస్టీ మోర్చా అధ్యక్షుడు మానుపటి బాలకృష్ణతో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకుని సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ సందర్భంగా కందుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య హక్కులకు విఘాతం కలిగించే చర్యగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను శాంతియుతంగా వ్యక్తం చేసే హక్కు ఉందని, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును అడ్డుకోవడం సమంజసం కాదని అన్నారు.

మరిన్ని వార్తలు