చెవిటి మూగ సంఘం నూతన కార్యవర్గం

14-11-2026 | 05:56pm

భైంసా (విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా(Nirmal District) చెవిటి మూగ అభ్యర్థుల సంఘం(Association of Deaf and Mute Candidates) జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్టు ఎన్నికల అధికారి సాయినాథ్(Election Officer Sainath) తెలిపారు. నిర్మల్ పట్టణంలోని టీఎన్జీవో కార్యాలయంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు(Elections) నిర్వహించగా కొత్త కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ప్రకటించడం జరిగింది అన్నారు.

అధ్యక్షులుగా బి సంతోష్, ప్రధాన కార్యదర్శిగా వి నరేష్ తో పాటు జిల్లా లో 14 మంది కార్యవర్గ సభ్యులను పూర్తిస్థాయిలో సంఘం అధికారికంగా ప్రకటించిందని తెలిపారు. సంఘం రెండు సంవత్సరాలపాటు పనిచేస్తుందని హక్కుల కోసం సంఘ అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు ఎన్నికైన కార్యవర్గం సన్మానం చేశారు.

మరిన్ని వార్తలు