59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో జగిత్యాల ఎమ్మెల్యే

14-11-2026 | 05:34pm

జగిత్యాల, నవంబర్ 14 ( విజయక్రాంతి ) : జగిత్యాల జిల్లా(Jagtial District) కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో(District Library)  నవంబర్ 14 న భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ(Former Prime Minister of India, Late Pandit Jawaharlal Nehru) జయంతి సందర్భంగా 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో(National Library Week) భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్(Jagtial Legislator Dr. Sanjay Kumar), జిల్లా లైబ్రరీ చైర్మెన్ సంఘనబట్ల దినేష్ పాల్గొన్నారు.

విద్యార్థులను ఉద్దేశించి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని, గ్రంథాలయాలు విద్యార్థుల విజ్ఞాన వికాసానికి ఎంతో దోహదపడతాయని అన్నారు. విద్యార్థులు పాఠ్యపుస్తకాలతో పాటు వివిధ విజ్ఞాన సంబంధిత పుస్తకాలను చదివే అలవాటు చేసుకోవాలని సూచించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు కృషి చేయటం జరిగిందన్నారు.

గతంలో పోటీ పరీక్షలు లైబ్రరీ విద్యార్థుల కోరిక మేరకు భోజనం వసతి కల్పించడం జరిగిందని, 1 కోటి రూపాయలతో లైబ్రరీ భవనం మంజూరు చేసి దాదాపు నిర్మాణం పూర్తి చేయటం జరిగిందని, విద్య తోనే వికాసం అని అన్నారు. గురుకుల పాఠశాలల్లో వసతులు లేక  200కోట్ల తో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్ మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. జిల్లా కేంద్రంలో లైబ్రరీ ప్రారంభానికి లైబ్రరీ చైర్మెన్  చొరవ చూపాలని సూచించారు. గ్రంథాలయాల అభివ్రుద్ది కి నా వంతుగా నిధులు మంజూరు చేస్తా అన్నారు.

ఈ కార్యక్రమంలో డి సి సి అధ్యక్షులు గాజంగి నందయ్య, మున్సిపల్ కమిషనర్ సత్య ప్రణవ్, పాక్స్ చైర్మెన్ దామోదర్ రావు, నవీన్ రావు, కౌన్సిలర్ మమత రామకృష్ణ రెడ్డి, కార్యదర్శి శంకరయ్య, బండ శంకర్, సమిండ్ల శ్రీనివాస్, పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు సతీష్, మాజీ మున్సిపల్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్, జిల్లా యూత్ అధ్యక్షులు రాజేష్,  సేవాదళ్ రాష్ట్రసెక్రటరీ ముకేష్ ఖన్నా, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు