కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన డిప్యూటీ డిఎంహెచ్ఓ
07-11-2026 | 10:26pm
జగిత్యాల,(విజయక్రాంతి): కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డిఎంహెచ్ఓ ఎన్ శ్రీనివాస్ అకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ కు సంబంధించిన వివిధ రకాల వైద్య సేవలను పరీక్షించారు. అవుట్ పేషెంట్ విభాగాన్ని, ఇన్ పేషెంట్ విభాగాన్ని, ఫార్మసీని, ల్యాబ్లు, అన్ని విభాగాలు తిరిగి చూసి రిజిస్టర్లు తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
టీబి కేసులను తొందరగా గుర్తించి తొందరగా న్యాయం అయినందుకు తగిన మందులు ఇవ్వాల్సిందిగా సూచించడం జరిగినది. డిప్యూటీ డిఎంహెచ్ఓ శ్రీనివాస్ వెంట వైద్యాధికారి డాక్టర్ పి సింధుజ, నర్సింగ్ ఆఫీసర్ పి కావ్య, ల్యాబ్ టెక్నీషియన్ చిన్న రాజయ్య పాల్గొన్నారు.