పోలీస్ ఫ్లాగ్ డే పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదానం
సిద్దిపేట క్రైం: పోలీస్ ఫ్లాగ్ డే–2026 సందర్భంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన, షార్ట్ ఫిల్మ్ (వీడియోగ్రఫీ), ఫోటోగ్రఫీ పోటీల్లో విద్యార్థులు, యువత, పోలీస్ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోటీల్లో విజేతలకు శనివారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీ రష్మీ పెరుమాళ్ ప్రశంసా పత్రాలతోపాటు బహుమతులు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ఈ పోటీల్లో యువత, సిబ్బంది తమ ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించారని కొనియాడారు.
విద్యార్థుల విభాగంలో బి.భావన (10వ తరగతి, శ్రీవిద్యానికేతన్ హైస్కూల్, బెజ్జంకి) ప్రథమ, బి.దివిజ (8వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, దౌల్తాబాద్) ద్వితీయ, ఎం.ఆదిత్య (10వ తరగతి, శ్రీవిద్యానికేతన్ హైస్కూల్, బెజ్జంకి) తృతీయ స్థానంలో నిలిచారు. పోలీస్ కాన్స్టేబుల్ విభాగంలో జి.చిరంజీవి(అక్కన్నపేట పోలీస్ స్టేషన్) ప్రథమ, ఎ.రవళిక (బెజ్జంకి పోలీస్ స్టేషన్) ద్వితీయ, జి.దివ్య ( సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్, సిద్ధిపేట) తృతీయ బహుమతులను అందుకున్నారు.
ఎస్ఐ, ఆపై స్థాయి అధికారుల విభాగంలో పి.రోహిత్ (ఆర్ఎస్ఐ, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్, సిద్దిపేట), బి.అభిలాష్ (ఆర్ఎస్ఐ, సీఏఆర్ హెడ్‌క్వార్టర్స్, సిద్దిపేట) బహుమతులు పొందారు. వీడియోగ్రఫీ(షార్ట్ ఫిల్మ్)లో వై.సాయి ప్రసాద్ (సైబర్ క్రైంపై వీడియో)ప్రథమ, ఇ.వీరప్ప (పోలీసుల త్యాగాలు, విధి నిర్వహణను వివరిస్తూ వీడియో) ద్వితీయ స్థానంలో నిలిచారు. ఫోటోగ్రఫీలో కె.సతీష్ (సాక్షి) బహుమతి పొందారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) కుశాల్కర్, అదనపు డీసీపీ (ఏఆర్) సుభాష్ చంద్రబోస్, ఇన్స్పెక్టర్ లతీఫ్ పాల్గొన్నారు.