డ్వాక్రా మహిళల కమ్యూనిటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన
మహిళా సంఘాల కార్యకలాపాలకు మరింత వెసులుబాటు కల్పించడమే లక్ష్యం - ఎమ్మెల్యే జారె
దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని మొద్దులగూడెం గ్రామం(Moddulagudem village)లో డ్వాక్రా మహిళల(Dwakra women) కోసం నిర్మించనున్న కమ్యూనిటీ భవన నిర్మాణ పనులకు అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(MLA Jare Adinarayana) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్వావలంబన సాధించడంతో పాటు కుటుంబ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
మహిళా సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకోవడానికి సంఘ కార్యకలాపాలు కొనసాగించడానికి ఈ కమ్యూనిటీ భవనం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. మహిళలకు అవసరమైన సౌకర్యాలు కల్పించి వారి అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధ్యక్షులు కక్కిరాల రమేష్, మొద్దులగూడెం సర్పంచ్ బేతం రుక్మిణి, ఉప సర్పంచ్ కూరం సరస్వతి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు డ్వాక్రా మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.