దిగొచ్చిన బంగారం ధరలు

18-11-2026 | 11:42am

కొనుగోలుదారులకు ఊరట.. బంగారం ధరల్లో భారీ క్రాష్!

హైదరాబాద్: బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరిపోయే Good News! గత కొంతకాలంగా భారీగా పెరిగిన Gold Rates ఇప్పుడు ఒక్కసారిగా దిగొచ్చాయి. హైదరాబాద్ Bullion Market‌లో బుధవారం పసిడి ధరలు భారీగా తగ్గాయి. అటు వెండి ధర కూడా భారీగా పడిపోవడంతో కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. తాజా ధరల ప్రకారం.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ.2,780 తగ్గింది. దీంతో ప్రస్తుతం ఈ ధర రూ.1,33,260కు చేరింది. మరోవైపు ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ కూడా రూ.2,550 పడిపోయి రూ.1,22,150 వద్ద కొనసాగుతోంది. 

బంగారం మాత్రమే కాదు.. వెండి ధర కూడా భారీగా దిగివచ్చింది. కిలో Silver Rate ఏకంగా రూ.5,000 తగ్గి రూ.1,85,000కు చేరింది. వరుసగా ధరలు తగ్గుతుండటంతో Gold and Silver Buyers‌లో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా 24 క్యారెట్ల బంగారం ధర గత మూడు రోజుల్లోనే రూ.4,360 తగ్గడం గమనార్హం. ఈ Price Drop పసిడి కొనుగోలుదారులకు కొంత ఊరటనిస్తోంది. అయితే ఈ ధరలకు అదనంగా 3 శాతం GST చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రాంతాలను బట్టి Gold Rates‌లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కొనుగోలు చేసే ముందు స్థానిక మార్కెట్ ధరలను పరిశీలించడం మంచిది.

మరిన్ని వార్తలు