పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

18-11-2026 | 11:45am

గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి

రాజాపూర్ లో 478 పెన్షన్ ప్రొసీడింగులు పంపిణీ: ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

రాజాపూర్: పేదల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి(MLA Anirudh Reddy) అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని జెకె ఫంక్షన్ ప్యాలెస్ లో మండలంలోని 24 గ్రామ పంచాయితీలకు చెందిన 478 వితంతు వికలాంగులు ఒంటరి మహిళలకు చెందిన నూతన పెన్షన్ ప్రొసీడింగుల(Pension Proceedings)ను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన వృద్ధులతో పెన్షన్ దారులతో ముఖాముఖిగా మాట్లాడారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... గత ప్రభుత్వాలు పేదవారిని ఇంకా నిరుపేదలుగా మార్చిన ఘనత గత ప్రభుత్వాలదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం(Congress Government) వచ్చాక అని ప్రతి పేద కుటుంబానికి రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వాలు పేదల కోసం చేసింది ఏమీ లేదని ఘాటుగా విమర్శించారు. పేదలకు గౌరవమైన ఇండ్లు లేక అవస్థలు పడుతుంటే ఒక్క ఇల్లు ఇచ్చిన పాపన పోలేదని అన్నారు.ఇక రేషన్ రేషన్ కార్డులు లేక పేదలు తిండికేంతో వస్తారని అన్నారు.

జడ్చర్ల నియోజకవర్గం లోని ప్రతి ఇంటికి వచ్చి ప్రతి పేదవాడి కష్టాలు తెలుసుకుంటానని అన్నారు. పేదవాడి కంట కన్నీరు తుడవడమే నాకు ఆనందాన్నిస్తుందని అన్నారు. పేదల కోసం పని చేస్తుంటే నాకు శత్రువులు ఎక్కువ అవుతున్నారని, ప్రజల బలంతోనే ముందుకు వెళ్తున్నా అని అన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఘాటుగా స్పందించి బీఆర్ఎస్ నాయకుల అవినీతి చిట్టా మొత్తం బయటపెడతానని తెలిపారు. ప్రజాధనాన్ని దోచుకున్న వారిని ఎట్టి పరిస్థితులలో వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇకనుండి నియోజకవర్గంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగనివ్వనని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామకృష్ణ,తాసిల్దార్  రాధాకృష్ణ,ఎంపీడీఓ విజయలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అశ్విని, డిసిసి వైస్ చైర్మన్ యాదయ్య,సుజయ్ చంద్రరెడ్డి, విక్రమ్ రెడ్డి,సర్పంచులు మాసయ్య, శేఖర్ సంతోష మీనా వెంకటయ్య గౌడ్  రమేష్,రమణ,గోవర్డ్ రెడ్డి, శివకుమార్, నర్సింలు సత్యనారాయణ గౌడ్ ఆయా గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు