గ్రీన్ ఎర్త్ సొసైటీ ఆధ్వర్యంలో శుభ్రత కార్యక్రమం

18-11-2026 | 11:23am

పాల్వంచ,(విజయక్రాంతి): పాల్వంచ(Palvancha) పట్టణ పరిధిలోని శ్రీనివాస కాలనీ శివాలయంలో గ్రీన్ ఎర్త్ సొసైటీ(Green Earth Society) ఆధ్వర్యంలో బుధవారం శుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రీన్ ఎర్త్ సొసైటీ వ్యస్థాపక అధ్యక్షులు రమేష్ రాథోడ్(Green Earth Society Founder President Ramesh Rathod) ఆధ్వర్యంలో ఆలయ పరిసరాలను శుభ్రపరిచి, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. ఆలయ పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం భక్తుల ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక వాతావరణానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు.

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, దేవాలయాలు, బడి, గుడి ప్రదేశాలను శుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. “పరిశుభ్రమైన పరిసరాలు – ఆరోగ్యకరమైన సమాజం” అనే లక్ష్యంతో గ్రీన్ ఎర్త్ సొసైటీ చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో  నునవత్ అఖిల్, శనిగరపు సతీష్, చల్ల వెంకట్రావు, ప్రసాద్, వంశీ, ఆలయ పూజారి నరేష్ సొసైటీ సభ్యులు, స్థానిక యువకులు పాల్గొని సేవాభావంతో ఆలయ పరిసరాలను శుభ్రపరిచారు అనీ పేర్కొన్నారు .

మరిన్ని వార్తలు