బ్యాంకింగ్ షేర్ల జోరు.. రికార్డు స్థాయిలో బ్యాంక్ నిఫ్టీ

16-11-2026 | 05:33pm

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు(Indian Stock Markets) లాభాల బాట పట్టాయి. బ్యాంకింగ్, బీమా, ఆసుపత్రుల రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో సోమవారం (నవంబర్ 16) ప్రధాన సూచీలు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్(BSE Sensex) 512 పాయింట్లు ఎగబాకి 82,105 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ(NSE Nifty) 147 పాయింట్లు లాభపడి 25,291 వద్ద ముగిసింది.

ఈ ట్రేడింగ్‌లో బ్యాంకింగ్ రంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిఫ్టీ బ్యాంక్ 542 పాయింట్లు పెరిగి 61,576 వద్ద ముగిసింది. గతంలో నమోదైన 61,551 రికార్డు ముగింపు స్థాయిని అధిగమించి సరికొత్త ఆల్‌టైమ్ క్లోజింగ్ రికార్డును సొంతం చేసుకుంది. మరోవైపు మిడ్‌క్యాప్, లోహాలు, ఆటోమొబైల్ రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. దీంతో ప్రధాన సూచీలు లాభాల్లో ముగిసినా మార్కెట్ బ్రెడ్త్ ప్రతికూలంగా నమోదైంది. బ్యాంకింగ్ రంగ కొనుగోళ్లే మార్కెట్‌కు ప్రధాన బలంగా నిలిచాయి.


మరిన్ని వార్తలు