మంగనూరులో విద్యుత్తుద్ఘాతానికి ఇల్లు దగ్ధం
రూ.2 లక్షల పంట డబ్బులు కాలి బూడిద
బిజినేపల్లి, నవంబర్ 16 : మండలంలోని మంగనూరు గ్రామానికి(Manganuru village) చెందిన బోల వెంకటయ్య అనే వ్యక్తికి చెందిన ఇల్లు సోమవారం మధ్యాహ్నం విద్యుత్తుద్గాతానికి దగ్ధం అయింది. ఈ దుర్ఘటనలో పంట అమ్మిన డబ్బులు రూ.రెండు లక్షలతో పాటు విద్యా సర్టిఫికెట్లు, ఆస్తి పత్రాలు దగ్ధం అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన వెంకటయ్య ఇంట్లో వాటర్ హీటర్ ఆన్ చేశారు.
ప్రమాదశావత్తు విద్యుద్ఘాతం చోటు చేసుకొని, ఇల్లు మొత్తం దగ్ధం అయింది. విషయం గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో వరి, పత్తి పంట అమ్మగా వచ్చిన డబ్బులు రూ.రెండు లక్షలు, ఆస్తి పత్రాలు వంటివి బీరువాలో దగ్ధం అయ్యాయి. ఇంట్లోని వస్త్రాలు, వ్యవసాయ సామాగ్రి దగ్ధం కాగా మొత్తం రూ.5 లక్షల వరకు ఆస్తి నష్టం జరగవచ్చని గ్రామస్థులు అంటున్నారు.