ఢిల్లీలో మరో భవనం బోల్తా

17-11-2026 | 12:11pm

దేశ రాజధాని ఢిల్లీలో భవనాల కూల్చివేత ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తూర్పు ఢిల్లీలోని కస్తూర్బా నగర్‌లో మంగళవారం ఓ ఇంటి పైకప్పు (Roof Collapse) ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఉన్నవారితో పాటు మరో ఆరుగురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. శిథిలాలను తొలగించి చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనం కూలిపోవడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వరుసగా చోటుచేసుకుంటున్న భవనాల కూల్చివేత ఘటనలు ఢిల్లీ వాసుల్లో భయాందోళనలు రేపుతున్నాయి.

మరిన్ని వార్తలు