సిలికాన్ వ్యాలీ చరిత్రలోనే రికార్డు

20-11-2026 | 05:00am

ఒక్క రాత్రిలో 4,250 మంది కోటీశ్వరులయ్యారు. ఆంథ్రోపిక్ ఐపీవోతో కాసుల వర్షం కురిసింది. సంస్థలోని దాదాపు 70 శాతం మంది ఉద్యోగులకు భారీ సంపద సమకూరింది. ఏడుగురు వ్యవస్థాపకులకు ఒక్కొక్కరికి రూ.2,600 కోట్ల లాభం చేకూరింది. ఫౌండర్లకు మొత్తంగా రూ.18,300 కోట్లకు పైగా ఆదాయం రాగా ఐపీవో ద్వారా ఏకంగా రూ.7.6 లక్షల కోట్ల నిధుల సేకరణ జరిగింది. కంపెనీ మొత్తం మార్కెట్ విలువ రూ.140 లక్షల కోట్లకు చేరడం గమనార్హం.

ఆంథ్రోపిక్ అనేది కృత్రిమ మేధ భద్రత, అధునాతన ఏఐ మోడళ్ల అభివృద్ధిపై దృష్టి సారించిన అమెరికన్ సంస్థ. ఇది తన క్లాడ్ ఏఐ మోడళ్లు , భారీ పబ్లిక్ ఆఫర్ వార్తలతో ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఆంథ్రోపిక్ తన ఐపీవోతో భారీ నిధులు సమీకరించింది. ఇది స్పేస్‌ఎక్స్ రికార్డును అధిగమించి మార్కెట్ విలువను 1.4 ట్రిలియన్ డాలర్లకు పైగా తీసుకెళ్లిందని కథనాలు పేర్కొంటున్నాయి. కోడింగ్, ఫైనాన్స్, సైన్స్ వంటి రంగాల కోసం క్లాడ్ ఫేబుల్ 5.2, మిథోస్ 5.2 అలాగే వేగవంతమైన క్లాడ్ సాన్నెట్ 5.5 వంటి మోడళ్లను సంస్థ అందిస్తోంది.

ఏఐ రాక, వైద్య రంగంలో మా ర్పులు, ఉద్యోగాలపై ప్రభావం వంటి అంశాలపై సంస్థ పరిశోధకులు, నాయకత్వం చర్చలు జరుపుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రం గంలో మరో సంచలనం నమోదైంది. ప్రముఖ ఏఐ చాట్‌బాట్ క్లాడ్‌ను అభివృద్ధి చేసిన ఆంథ్రోపిక్ సంస్థ స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. కంపెనీ వ్యవస్థాపకుడు డారియో అమోడెయ్ నేతృత్వంలో జరిగిన ఈ ఐపీఓ ద్వారా ఏకంగా 81.3 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ఒక్కో షేరును 83(సుమారు రూ.7,745) డాలర్లకు విక్రయించింది.

ఇది సంస్థ ముందుగా నిర్ణయించిన 70 నుంచి 78 డాలర్ల ధరల శ్రేణి కంటే ఎక్కువ కావడం విశేషం. ఈ భారీ ఐపీఓతో అంతరిక్ష పరిశోధన సంస్థ స్పే స్‌ఎక్స్ ఆఫరింగ్‌ను అధిగమించి, ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ అరంగేట్రంగా ఆంథ్రోపిక్ నిలిచింది. ఈ ఆఫరింగ్‌లో మొత్తం 98 కోట్ల షేర్లున్నాయి. ఇందులో 95.635 కోట్ల షేర్లను ఆంథ్రోపిక్ విక్రయించగా, మిగిలిన 2.365 కోట్ల షేర్లను ఇప్పటికే వాటాలు కలిగి ఉన్న పెట్టుబడిదారులు విక్రయించారు. ఆంథ్రోపిక్ ఐపీఓపై ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదా రుల్లో ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా భారతీయ ఇన్వెస్టర్లు కూడా ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.

గతంలో ఎన్విడియా వంటి ఏఐ కంపెనీల ప్రారంభ దశలో పెట్టుబడి పెట్టే అవకాశాలను కోల్పోయిన వారు ఇప్పుడు ఆంథ్రోపిక్ దృష్టి సారిస్తున్నారు. అయితే భారతీయ రిటైల్ ఇన్వెస్టర్లు నేరుగా ఐపీఓ ఆఫర్ ధరకు షేర్లను కొనుగోలు చేసే అవకాశం లేదు. ఎందుకంటే భారత్ ఈ ఐపీఓ రిటైల్ ఆఫరింగ్ పరిధిలో లేదు. అయితే ట్రేడింగ్ ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయ పెట్టుబడి ప్లాట్‌ఫాం ద్వారా భారతీయులు ఈ షేర్లను కొనుగోలు చేయవచ్చు. ఏఐ సృష్టిస్తున్న సంపద సిలికాన్ వ్యాలీ చరిత్రలోనే కనీవినీ ఎరు గని రికార్డులను తిరగరాస్తోంది.

ప్రముఖ ఏఐ మోడల్ ’క్లాడ్’ మాతృసంస్థ ఆంథ్రోపిక్ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో) ద్వారా ఏకంగా 4,250 మంది ఉద్యోగులు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయారు. గతంలో ఎలాన్ మస్క్  స్పేస్‌ఎక్స్ నమోదు చేసిన రూ.7.02 లక్షల కోట్ల ఐపీవో రికార్డును ఆంథ్రోపిక్ తుడిచిపెట్టేసింది. ఈ మెగా ఇష్యూతో ఆంథ్రోపిక్ మార్కెట్ విలువ రూ.140 లక్షల కోట్లకు(1.5 ట్రిలియన్ డాలర్లు) చేరుకుంది. ఓపెన్ ఏఐ నుంచి బయటకు వచ్చిన పరిశోధకులు కేవలం ఆరేళ్ల క్రితం స్థాపించిన ఒక స్టార్టప్, ఇంత భారీ స్థాయిలో ఉద్యోగులను కుబేరులుగా తీర్చిదిద్దడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ సంస్థలో పెట్టు బడులు పెట్టిన గూగుల్, అమెజాన్ వాటాల విలువ కూడా ఒక్కొక్కటి రూ.9.3 లక్షల కోట్లకు పైగా పెరిగింది.

సీనియర్ జర్నలిస్ట్, 93973 99298

-ఇస్కా రాజేష్ బాబు

మరిన్ని వార్తలు