శ్రీకరం.. శుభకరం.. కార్తీకం!

10-11-2026 | 05:00am

కార్తీకమాసం(Karthika Masam)లో ప్రతి పల్లె, పట్టణం, నగరంలోని ఆలయాలు హరి హరుల నామస్మరణతో మార్మోగుతాయి. రాత్రుళ్లు దీపాల వెలుగులు విరజిమ్ముతాయి. ఎంతో పవిత్రంగా భావించే కార్తీక మాసం నేటి నుంచి ప్రారంభమవుతోంది. శివకేశవులకు ప్రీతికరమైన ఈ మాసం వచ్చే నెల 8 వరకు కొనసాగతుంది. ఈ నెల రోజులు శైవ, వైష్ణవ క్షేత్రాల్లో పూజలు హోరెత్తుతాయి. భక్తుల సందడితో కళకళలాడుతాయి. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. శ్రీమహావిష్ణువుకు సమానదేవుడు లేడు. వేదంతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థము లేదు. సనాతన హిందూ ధర్మంలో కార్తీక మాసం విశిష్టత అర్థం చేసుకోవచ్చు.

హైందవ మతంలో ఉత్తరాయణంలో మాఘమాసం, దక్షిణాయణంలో కార్తీకమాసానికి ఎంతో విశిష్టత ఉంది. తెలుగు మాసాల్లో చాలా ప్రత్యేకమైంది. దీన్ని ఆరోగ్యపరమైన మాసంగా, ప్రతిరోజూ పర్వదినంగా భావిస్తారు. పౌర్ణమినాటి చంద్రుడు కృత్తిక నక్షత్రం సమీపంలో ఉడం టం వల్ల ఈ మాసానికి కార్తీక మాసంగా పేరు వచ్చింది. నెల రోజులు ఉపవాసంతో పాటుగా దానాలు చేయడం, రాత్రుళ్లు దీపాలు వెలిగించి శివున్ని పూజిస్తారు. అలాంటి పవిత్ర మాసం ఈ యేడాది దీపావళి తర్వాతి రోజునే ఆరంభం కావడం మరింత విశిష్టతను సంత రించుకోనున్నది.  నదీ స్నానాలు, వ్రతాలకు శుభకరం. అయ్యప్ప దీక్ష కూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది. హరిహరులను ఇద్దరినీ పూజించడం జరుగుతుంది. ఈ మాసంలో నారాయణ, కేదారేశ్వర స్వామి వ్రతాలు చేసుకుంటారు.

ఏకాదశి, ద్వాదశి సోమవారాలు, పౌర్ణమి సోమవారం రోజు నియమ నిష్టతో ఉపసవాసం ఉండి 365 ఒత్తులతో చేసే దీపారాధనతో పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. నువ్వుల నూనె దీపారాధనకు తప్ప ఏ అవసరాలకూ వాడకూడదు.దీపారాధనకు చాలా విశిష్టత ఉంది. ఒక్కరోజు దీపం వెలిగిస్తే ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఆజ్ఞాన చీకట్లను తొల గించి జ్ఞానం అనే వెలుగులు నింపుకోవాలన్నదే దీపం ప్రత్యేకత. నలుగుతో స్నానం చేయరాదు. మహిళలకు ప్రత్యేకమైనదిగా కార్తీక మాసం నిలిచిపోతుంది.

ఉసిరి చెట్టుకింద దీపాలను వెలిగించి పూజలు చేసుకుంటారు. ఉదయం, సాయంత్రం దీపారాధన చేస్తే చాలా మంచిది. సూర్యోదయం కంటే ముందుగా లేచి స్నానం చేయాలి. సోమవారాలు అత్యంత పవిత్రం. కనీసం సోమవారాలు పూజలు చేసినా ఫలం లభిస్తుంది. ఈసారి నాలుగు కార్తీక సోమవారాలు ఉంటాయి. శివుడికి ప్రత్యేకంగా రుద్రాభిషేకం, లక్షబిల్వార్చ, అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరిపిస్తారు.

నవంబర్ 11 న యమ ద్వితీయ భగినీ హస్త భోజనం, 13న నాగుల చవితి, నవంబర్ 14 నాగుల పంచమి 15 న సుబ్రహ్మణ్య షష్ఠి, నవంబర్ 16 మొదటి కార్తీక సోమవారం, 17న గోపాష్టమి, 20న ఉత్గ్సన ఏకాదశి, 21న క్షీరాబ్ది ద్వాదశి, 22న ప్రదోష వ్రతం, 24న కార్తీక పౌర్ణమి, గురునానక్ జయంతి, 30న మూడవ సోమవారం, డిసెంబర్ 4న ఉత్పన్న ఏకాదశి, డిసెంబర్ 8న కార్తీక మాసం ముగింపు ఉంటుంది. ఈ మాసంలో చాలా మంది మద్యం, మాంసాహారానికి దూరంగా ఉంటారు.

* తేలికైన ఆహారం భుజించడం

* ఉల్లి, వెల్లుల్లి తీసుకోవద్దు.

* పాలు, పండ్లు తినొచ్చు.

* రాత్రి భోజనం చేయకూడదు.

* అబద్ధాలు, దైవదూషణ చేయరాదు. అసత్యాలు మాట్లాడకూడదని, తప్పుడు పనులు చేస్తే పాపమని పురాణాలు చెబుతున్నాయి.

ఓం నమశ్శివాయ హరహర మహదేవ శంభోశంకర

 వాస్యకర్త సెల్ : 848445134

కామిడి సతీశ్ రెడ్డి 

మరిన్ని వార్తలు