బరాత్ బీట్ అదుర్స్!
ప్రియదర్శి(Priyadarshi) హీరోగా, నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త సినిమా ‘ఇడుపు కాయితం’. యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి ఈ సినిమాను ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో ఎంటర్‌టైనింగ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రూపొందుతోంది. ఇందులో శివజ్యోతి, జోర్దార్ సుజాత, చంద్రవ్వ, మౌనికరెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా డిసెంబర్ 11న వరల్డ్ వైడ్ థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది. దీపావళి పండుగ సందర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ ఈ సినిమా నుంచి ‘బరాత్ బీట్..’ సాంగ్ రిలీజ్ చేశారు. సంగీత దర్శకుడు సురేశ్ బొబ్బిలి ఈ పాటను అదిరే బీట్‌తో కంపోజ్ చేశారు. ఈ పాటలో నాగదుర్గ మాస్ డ్యాన్స్ స్టెప్స్ హైలైట్‌గా నిలుస్తున్నాయి. ఈ చిత్రానికి డీవోపీ: ఎంఎన్ బాల్ రెడ్డి; సంగీతం: సురేశ్ బొబ్బిలి; ఎడిటర్: శ్రీధర్ సొంపల్లి; ఆర్ట్: ఆశిష్ తేజ.