పాండవుల చెరువులో దొంగలు!

10-11-2026 | 05:05am
  1. ఏడాదిగా ట్యాంకుల ద్వారా నీటి తరలింపు 
  2. కాల్వల నుండి కూడా నీటి దోపిడీ 
  3. హెచ్‌ఎండీఏ కాంట్రాక్టర్‌కు నీటి అమ్మకం 
  4. లక్షల రూపాయల బిల్లులు 
  5. పట్టించుకోని ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు

గజ్వేల్, నవంబర్ 9: గజ్వేల్(Gajwel) పట్టణంలోని పరిధిలోని పాండవుల చెరువులో దొంగలు పడ్డారు. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో చెరువులన్నీ దాదాపుగా ఎండిపోగా, చెరువులలో ఉన్న కొద్దిపాటి నీటిని సైతం అక్రమార్కులు తోడేస్తున్నారు. పట్టణంలోని పాండవుల చెరువులతో పాటు బర్రి చెరువు, కొండపోచమ్మ సాగర్ కాలువలలో వీటిని ప్రైవేటు బ్యాంకుల ద్వారా సేకరించి పలువురి అవసరాలకు విక్రయిస్తున్నారు.

రింగ్ రోడ్డులోని హెచ్‌ఎండిఏ ఆధ్వర్యంలో సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన మొక్కలకు రోజుకు 15 ట్యాంకర్ల వరకు నీటిని వినియోగిస్తున్నట్లు టాంకర్ల డ్రైవర్లు వెల్లడించడం గమనార్హం. ఇప్పటికే పలువురి ఆక్రమణల వల్ల పాండవుల చెరువు విస్తీర్ణం సగానికి తగ్గిపోగా, ఉన్న కొద్దిపాటి  నీటిని కూడా వివిధ అవసరాలకు ప్రైవేటు వ్యక్తులు తరలించడంతో చెరువులో నీటిమట్టం తగ్గిపోయింది. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులను సంప్రదించగా,  తమకు ఈ విషయం తెలియదని, తమ దృష్టికి రాలేదని వెల్లడించారు. మున్సిపల్ కమిషనర్ను సంప్రదించగా చెరువుల రక్షణ బాధ్యత పూర్తిగా ఇరిగేషన్ అధికారుల దేనన్నారు.

ఎవరికీ అనుమతులు ఇవ్వలేదు

మున్సిపాలిటీ పరిధిలోనిచెరువులు, వీటిని వినియోగించుకోవడానికి ఎవరికి అనుమతి ఇవ్వలేదు. వీటిని ఎవరైనా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. వినియోగించినట్లు మా దృష్టికి రాలేదు. మీ తరలించిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటాం. వాహనాలను సీజ్ చేయిస్తాం.

 సుధీర్, ఇరిగేషన్ ఏఈ 


మరిన్ని వార్తలు