రౌడీ రాకాసి..

10-11-2026 | 05:00am

ఆది సాయికుమార్(Aadi Saikumar) హీరోగా నటిస్తున్న సినిమా ‘ఈగో రాజా’. ఎస్జిఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జీ సురేశ్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు గురు శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో ఆది కోలీవుడ్‌లోకి అరంగేట్రం చేస్తున్నారు. ఇందులో ఆదితో పాటు సతీశ్, శరణ్య రామచంద్రన్, ఆద్య ప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ‘రౌడీ రాకాసి’ అంటూ సాగే ఓ లవ్ సాంగ్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇక ఇందులో ఆది స్టెప్పులు, హీరో హీరోయిన్ ట్రాక్, పాటను చిత్రీకరించిన తీరు ఎంతో అందంగా ఉంది. గిబ్రాన్ వైబోధ బాణీ అందించిన ఈ పాటను రామజోగయ్య రాయగా, శిభి శ్రీనివాసన్ పాడారు. ఈ చిత్రానికి సంగీతం: గిబ్రాన్ వైబోధ; డీవోపీ: మనోజ్ పరమహంస; ఎడిటింగ్: మేఘనాథన్. 

మరిన్ని వార్తలు