‘దిమాగీ నక్సల్స్’లను ఓడించాలి

10-11-2026 | 05:05am

సీఆర్‌పీఎఫ్‌కు మోదీ పిలుపు

న్యూఢిల్లీ, నవంబర్ 9: కొందరు ‘దిమాగీ నక్సల్స్’ వ్యక్తులు రాజకీయ పార్టీల్లోకి, వివిధ సంస్థల్లోకి చొరబడి రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతున్నారని ప్రధాని మోదీ(Prime Minister Modi) ఆరోపించారు. ఇలాంటి శక్తులను గుర్తించాలని, వారిని ఓడించి దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని భద్రతా సిబ్బందికి సూచించారు. దీపావళి వేడుకలను మోదీ ఆదివారం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా కరణ్‌పూర్‌లో సైనికులతో కలిసి జరుపుకున్నారు. సీఆర్‌పీఎస్ శిబిరాన్ని సందర్శించిన ప్రధాని వారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ప్రతిపక్ష పార్టీలను, పలు సంస్థలను ‘నక్సలిజం భావాజాలం’ ప్రభావితం చేస్తోందని ఆరోపించారు. దేశంలో సాయుధ నక్సలిజం ప్రభావం తగ్గినప్పటికీ దాని భావజాల ముప్పు మాత్రం ఇంకా కొనసాగుతోందని హెచ్చరించారు. 


మరిన్ని వార్తలు