ప్రకృతికి రాజకీయ రంగులా?
ప్రొఫెసర్ సంగని మల్లేశ్వర్ :
తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం(Revanth Reddy's government) ఇప్పటికే గత పాలన నుంచి సంక్రమించిన ఆర్థిక భారాన్ని అధిగమిస్తున్నది. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేస్తున్నది. ఒకవైపు రాష్ట్ర ఆర్థిక వనరులపై(State financial resources) ఒత్తిడి పెరుగుతున్నది. మరోవైపు కాళేశ్వరం వివాదాలు(Kaleshwaram Controversies), తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వానికి సవాళ్లుగా మారాయి. ఈ తరుణంలో ఎల్ నినో ప్ర భావంతో వర్షాలు తగ్గి, ఎండలు తీవ్రతరమై, సాగునీరు, తాగునీరు, విద్యుత్()Irrigation, drinking water, electricity అవసరాలు పెరిగితే పరిస్థితి మరింత క్లిష్టంగా మారొచ్చు.
మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు ఇప్పటికే ఆర్థిక, పరిపాలనా సవాళ్లను ఎదుర్కొంటున్న రాష్ట్రానికి ప్రకృతి వైపరీత్యాల ముప్పు అదనపు భారంగా ప రిణమించొచ్చు. అయితే ఎల్ నినోను నిం దించడం, కాళేశ్వరం సమస్యను రాజకీయ విమర్శలకే పరిమితం చేయడం పరిష్కా రం కాదు. వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలి. అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవాలి. రై తులకు అండగా నిలవాలి. తాగునీటి భద్రతకు ప్రాధాన్యమివ్వాలి. ఇది ప్రభుత్వానికి అత్యంత కీలకం.
గత ఆర్థిక నిర్ణయాల ప్రభావాలను అధిగమిస్తూనే, ప్రస్తుత స వాళ్లను ప్రజలపై భారం పడకుండా ఎదుర్కోవాల్సిన బాధ్యత రేవంత్ ప్రభుత్వంపై ఉంది. ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, శాస్త్రీ య ప్రణాళిక, రైతు సంక్షేమం, నీటి వనరుల సమర్థ నిర్వహణకు ప్రాధాన్యమిస్తే ఎల్ నినో వంటి ప్రకృతి సవాళ్ల ప్రభావాన్ని తగ్గించవచ్చు. సంక్షోభ సమయం లో పాలనా సామర్థ్యం నిరూపించే అవకా శం దక్కుతుంది. ఎల్ నినో కొత్తగా పుట్టుకొచ్చిన పరిణామం కాదు. రేవంత్ రెడ్డి తెచ్చిందీ కాదు.
పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు భూమధ్య రేఖ ప్రాం తాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సా ధారణ స్థాయి కంటే ఎక్కువగా పెరిగే వా తావరణ దృగ్విషయం. ఎల్ నినో గతం లో 16 సార్లు సంభవించింది. తెలంగాణలో ముఖ్యంగా 1982-83, 1997-98, 2002, 2009, 2014, 2015-16 సంవత్సరాల్లో బలమైన ఎల్ నినో పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడ్డాయి. 20 23-24లోనూ బలమైన ఎల్ నినో ఏర్పడింది. ఈ సందర్భాల్లో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వేడి, కరువు, వరదలు, వ్యవసాయ నష్టాల వంటి విభి న్న పరిణామాలు చోటుచేసుకున్నాయి. అ యితే వాటి తీవ్రత, ప్రభావిత ప్రాంతాలు ఒక్కోసారి ఒక్కో విధంగా ఉన్నాయి.
భారత్లో ఎల్ నినో వల్ల రుతుపవనాల వర్షాలు బలహీనపడే అవకాశం ఉంది. అయితే ప్రతి ఎల్ నినో సంవత్సరంలోనూ భారత్లో కరువు వస్తుందని చెప్పలేదు. హిం దూ మహాసముద్ర పరిస్థితులు, వాతావరణ వ్యవస్థలు, స్థానిక వర్షపాత పంపిణీ వంటి అనేక అంశాలు కూడా ప్రభావం చూపుతాయి.
2015-16 ఎల్ నినో సమయంలోనూ భారత్లోని అనేక ప్రాంతాలు వేడి, వర్షపాతం లోటు వంటి సమస్యలు ఎదుర్కొన్నాయి. తెలంగాణలో వానాకా లం ప్రారంభమైన జూన్ 1 నుంచి అక్టోబర్ 12 వరకు 615.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఈ కాలంలో 786.4 మి.మీ. వర్షపాతం నమోదు కావాలి. సాధారణం కంటే 22 శాతం 18 జిల్లాలు.. 320 మండలాల్లో లోటు ఉందని గణాంకాలు చెబుతున్నాయి.
సర్కారు ముందుచూపుతో!
సీఎం రేవంత్ ప్రభుత్వం ఎల్ నినో ము ప్పును దృష్టిలో ఉంచుకుని తాగు, సాగునీరు, వ్యవసాయం, విద్యుత్ రంగాలకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే జూన్ వరకు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళిక సిద్ధం చేయాలన్న దిశానిర్దేశం ముందస్తు సంసిద్ధతకు ప్రాధాన్యమిస్తోంది. ప్రతి జిల్లాలో నీటి లభ్యతను అంచనా వేసి, తాగునీటికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. చెరువులు, కుంటలు, జలాశ యాల్లో నిల్వల వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి.
నీటి వృథాను అరికట్టి, అవసరమైన చోట ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేయాలి. భూగర్భజలా లు అడుగంటుతున్న గ్రామాలను ముం దుగానే గుర్తించి ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి. వ్యవసాయ రంగంలో నష్టాలు వాటిల్లకముందే రైతులకు వాస్తవ పరిస్థితుల ఆధారంగా పంటల ప్రణాళికపై ప్ర భుత్వం సభలు, సమావేశాలు పెట్టి తక్కువ నీటితో పండే ఆరు తడి పంటలు, ప్రత్యామ్నాయ విత్తనాలు, సూక్ష్మసేద్య పద్ధతుల పై అవగాహన కల్పించాలి.
విద్యుత్ విషయంలో వ్యవసాయ అవసరాలు, గృహ వినియోగం, తాగునీటి పథకాలకు అవసరమైన సరఫరాను సమన్వయం చే యాలి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితుల్లో ఆస్పత్రులు, పాఠశాలలు, పట్టణా లు, గ్రామాల్లో ప్రజారోగ్య చర్యలు చేపట్టాలి. పంట నష్టం జరిగితే పరిహారం, పం టల బీమా, రుణాల విషయంలో రైతులకు సకాలంలో సహాయం అందించేం దుకు ముందస్తు విధివిధానాలు ప్రభుత్వానికి శ్రీరామరక్షా.
ముందస్తు ప్రణాళికలు ముఖ్యం!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కాలంలోనూ, తెలంగాణ ఆవిర్భావం తరువాత నూ వర్షాభావం, కరువు, వ్యవసాయ సం క్షోభం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యంగా వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే మెట్ట ప్రాంతాల్లో వర్షాలు ఆలస్యమైనా, మధ్యలో విరామం వచ్చినా రై తులపై ప్రభావం పడుతుంది. గత అనుభవం చెప్పేదేమిటంటే.. కరువు తీవ్రతను నిర్ణయించేది వర్షపాతం ఒక్కటే కాదు. చెరువుల్లో నీటి నిల్వలు, భూగర్భజలాల లభ్యత, సాగునీటి పంపిణీ, పంటల ఎ ంపిక, ప్రభుత్వ స్పందన కూడా కీలకమే.
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడంలో గత చరిత్ర మరో విషయాన్ని స్పష్టం చే స్తుంది. సంక్షోభం వచ్చిన తరువాత హడావుడిగా చర్యలు తీసుకోవడం కంటే, ముం దుగానే నీటి నిల్వలు పెంచడం, పంటల ప్రణాళిక రూపొందించడం, జలవిద్యుత్తు ఉత్పత్తి తగ్గే పరిస్థితుల్లో థర్మల్ విద్యుత్తు ఉత్పత్తి, బొగ్గు నిల్వలు, విద్యుత్తు అవసరాలను అంచనా వేయడం, గ్రామస్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం ఎంతో ప్రయోజనకరం. ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తే ప్రజలకు ఉపశమనం లభిస్తుంది.
అలాగని ప్రతిపక్షాలు ప్రకృతి ప్ర కోపాలకు రాజకీయ రంగు పులిమితే సమస్యలు పరిష్కారం కావు. అయితే ప్రకృతి విపత్తుల ముప్పును కూడా రాజకీయ వి మర్శలకు అవకాశంగా మలుచుకుంటే ప్రజలకు ఒరిగేదేమిటి? ప్రభుత్వాన్ని నిలదీయడం ప్రతిపక్షాల బాధ్యతే అయినా, సమస్యలకు పరిష్కారాలు సూచించడం కూడా అంతే ముఖ్యం కదా? సమంజసమైన సూచనలు ఇస్తే ప్రభుత్వం కూడా వ్యతిరేకతగా భావించకుండా స్వీకరించాలి.
నీటిని ఒడిసిపట్టుకోవాలి..
తెలంగాణ చరిత్రలో చెరువులు, కుంట లు, కట్టలు, కాలువలు వ్యవసాయానికి జీవనాధారంగా నిలిచాయి. కాకతీయుల కాలం నుంచి చిన్న నీటి వనరుల నిర్వహణకు ప్రాధాన్యం ఉంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్లోనూ, తెలంగాణ ఆవిర్భావం తరువాతనూ వర్షాభావం, కరువు, భూగర్భజ లాల తగ్గుదల, రైతుల పంట నష్టాలు పునరావృతమయ్యాయి. ఈ అనుభవాలు చెబుతున్నది ఒక్కటే వర్షాలు విఫలమైన తరువాత స్పందించడం కంటే, వర్షాలు సమృద్ధిగా ఉన్నప్పుడే నీటిని నిల్వ చేసుకోవడం ముఖ్యం. అక్టోబర్లో వేసవిని తల పించేలా ఉష్ణోగ్రతలు పెరగడం చూస్తే వేసవిలో నీటి లభ్యత తగ్గితే గ్రామీణ ప్రాంతా లు, పట్టణాలు, పశుపోషకులు, పరిశ్రమలు ప్రభావితమవుతాయి.
కాబట్టి జిల్లా, మండలం, గ్రామ స్థాయిలో అత్యవసర ప్రణాళిక రూపొందించాలి. భూగర్భజలాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలి. మ్నాయ వనరులను గుర్తించాలి. ట్యాంక ర్లు అవసరం ఏర్పడే ప్రాంతాలను ముం దుగానే నిర్ధారించాలి.ప్రభుత్వం తన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తే ఎల్నినో ను ఎదుర్కోవడం సమస్య కాదు. గత చరిత్ర చెప్పే పాఠాలను ఆచరణలో పెట్టి, శాస్త్రీయ అంచనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారానే ఈ సవాల్ ను ఎదుర్కోగలదు.
వ్యాసకర: కేయూ జర్నలిజం శాఖ విభాగాధిపతి, 9866255355