అందులో జక్కన్న సర్‌ప్రైజ్ ఎంట్రీ.. క్రికెటర్‌తో రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌..

16-04-2024 12:46:34 PM   

సినిమా అభిమానులు రాజమౌళి నెక్ట్స్ మూవీ అప్‌డేట్‌ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటే... జక్కన్న మాత్రం చిల్‌ మూడ్‌లో ఉన్నారు. సినిమా ఊసే ఎత్తకుండా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఇంతకీ దర్శకధీరుడు ఏం చేస్తున్నారు హావ్ లుక్‌. ట్రిపులార్ సినిమా రిలీజ్ అయి రెండేళ్లు దాటింది. ఇంత వరకు రాజమౌళి నెక్ట్స్‌ మూవీ పట్టాలెక్కలేదు. మహేష్‌తో మూవీ ఉంటుందన్న క్లారిటీ ఉన్నా... అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందన్న విషయం చెప్పలేదు.