calender_icon.png 31 October, 2025 | 8:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సురేశ్ షెట్కార్‌ను గెలపించండి

04-05-2024 02:05:25 AM

జహీరాబాద్, మే 3ః జహీరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్  షెట్కార్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ తెలం గాణ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎస్. గిరిధర్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలోని మల్చెల్మా, శేఖాపూర్ గిరి జన తాండల్లో సురేశ్‌కుమార్ షెట్కార్‌కు మద్దతుగా ఇంటింటి ప్రచారా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీ హామీల్లో ఇప్పటికే ఐదింటిని అమ లు చేసిందని ప్రజలకు గుర్తు చేశారు. బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని లూటీ చేశారన్నారు.

కేంద్రంలో పీఎం నరేంద్రమోదీ ప్రజలను మోసం చేశారని, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలను నమ్మి మోసపోవద్దన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి సురేష్ షెట్కార్‌ను గెలిపించాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు డా. ఉజ్వల్‌రెడ్డి, రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్  మాజీ ఛైర్మన్ తన్వీర్ హైమద్, నాగిశెట్టి రాథోడ్, నర్సింహారెడ్డి, గొల్ల బాస్కర్, ఎంజీ రాములు, ప్రతాప్‌రెడ్డి, సంగమేశ్వర్, జగన్, ఎన్‌ఎస్‌యూఐ నాయకులు హర్షవర్ధన్‌రెడ్డి, నాగిరెడ్డి, యువజన కాంగ్రెస్ నాయకులు రాజునాయక్ తదితరులున్నారు.