'పుష్పరాజ్'కు బాలీవుడ్‌ దర్శకుడి ప్రశంసలు!

16-04-2024 11:14:51 AM   

పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప-2’. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా ఈ చిత్రంపై బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు అనిల్‌శర్మ ప్రశంసల వర్షం కురిపించారు. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప-2’ (Pushpa2). ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది. తాజాగా ఈ చిత్రంపై బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు అనిల్‌శర్మ (Anil sharma) ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా తప్పకుండా సూపర్‌హిట్‌ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ఇటీవల టీజర్‌ వీక్షించిన ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘‘ఇప్పుడే ‘పుష్ప 2’ టీజర్‌ చూశా. సినిమా కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నా. గతేడాది ఆగస్టు 15న నేను దర్శకత్వం వహించిన ‘గదర్‌ 2’ విడుదలై బాక్సాఫీస్‌ వద్ద విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది అదే రోజున విడుదల కానున్న ‘పుష్ప 2’ సూపర్‌డూపర్‌ హిట్‌ అవుతుంది. ఆ సెంటిమెంట్‌ వర్కవుట్‌ అవుతోంది. తెలుగు చిత్ర పరిశ్రమ, చిత్ర బృందానికి నా అభినందనలు పుష్పరాజ్‌గా బన్నీ లుక్‌ నటన అత్యద్భుతంగా ఉంది.’’ అని అన్నారు. దీనిపై బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. (allu arjun)

1/4
2/4
3/4
4/4