చీటకోడూర్‌లో సినిమా చిత్రీకరణ ప్రారంభం

14-11-2026 | 06:09pm

జనగామ, నవంబర్ 14 (విజయక్రాంతి) : చీటకోడూర్ రామలింగేశ్వర దేవాలయంలో(Cheetakodur Ramalingeswara Temple) జనగామ యువకులు(Youth of Jangaon) నిర్మిస్తున్న సినిమా చిత్రీకరణ(Film shooting) ప్రారంభమైంది. మాజీ శాసనసభ్యులు రాజారెడ్డి, జనగామ పట్టణ మూడో వార్డు పురపాలక సభ్యులు బూడిద జ్యోతి ముహూర్తపు ఫలకం కొట్టి చిత్రీకరణను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు చాగంటి టింకు(Film director Chaganti Tinku) అలియాస్ జితేందర్ మాట్లాడుతూ 1990 సంవత్సరంలో జనగామ ప్రాంతంలో నాటి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు(Social, economic, and political conditions), ప్రజల జీవన విధానం, ప్రజా సమస్యలు, వాటి పరిష్కారానికి ప్రజలు చేసిన పోరాటాలు, కుటుంబ సంబంధాలు, త్యాగం, అవినీతికి వ్యతిరేకంగా యువకులు పోషించిన పాత్ర ఇతివృత్తంగా కొన్ని కల్పిత అంశాలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు వివరించారు.

సామాజిక దృక్కోణంతో జనగామ యువకులు చిత్ర నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయమని ముఖ్య అతిథులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు