సీనియర్ సిటిజెన్ల దీపావళి సమ్మేళనం

09-11-2026 | 06:52pm

జగిత్యాల, నవంబర్ 9 ( విజయక్రాంతి ) : తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్(Telangana All Senior Citizens Association) జగిత్యాల జిల్లా శాఖ(Jagtial District Branch) ఆధ్వర్యంలో దీపావళి పండుగ(Festival of Diwali) సందర్బంగా సోమవారం సీనియర్ సిటిజెన్ల దీపావళి సమ్మేళనం జరుపుకున్నారు. ఈ సందర్బంగా సీనియర్ సిటిజెన్స్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ భారతీయతకు నిలువుటద్ధంలా నిలిచే దీపావళి  పండుగ అంటే చీకటిపై వెలుగుకు, చెడుపై మంచికి ఇది విజయ సంకేతమన్నారు. దీపావళి వెలుగుల్లో  అంతకన్నా మించిన బంధాలు, అనుబంధాల స్మరణలు  ప్రతిఫలిస్తుంటాయిన్నారు.

అనంతరం జిల్లా నుంచి వెళ్లి వివిధ నగరాల్లో స్థిరపడి  పండుగ సందర్బంగా హరి అశోక్  కుమార్ ఆహ్వానం మేరకు పుట్టి పెరిగిన జగిత్యాల లో చిన్న నాటి స్నేహితులను కలవడానికి వచ్చిన వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన సీనియర్ సిటిజెన్లను హరి అశోక్ కుమార్ సన్మానించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి. హన్మంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథము, కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు, సహాయ అధ్యక్షులు బొల్లం విజయ్, పూసాల అశోక్ రావు, ఉపాధ్యక్షులు ఎం. డి. యా కూబ్, కొయ్యడ సత్యనారాయణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి బొబ్బాటి కరుణ, ధర్మపురి అధ్యక్షులు కండ్ల గంగాధర్, కోరుట్ల అధ్యక్షులు పబ్బా శివానందం, బుగ్గారం కార్యదర్శి దుబ్బేశం, జగిత్యాల పట్టణ అధ్యక్షులు మానాల కిషన్, సింగం గంగాధర్, భాస్కర్, పుప్పాల నర్సింగారావు, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు