డంపింగ్ యార్డ్ ఎత్తి వేయాలి

09-11-2026 | 06:56pm

మేడ్చల్ అర్బన్, నవంబర్ 9 (విజయక్రాంతి): మేడ్చల్ సర్కిల్(Medchal Circle) అత్తివేల్లి శివారులో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్(Dumping yard) ను ఎత్తివేయాలని బిజెపి నాయకుడు జకాట ప్రేమ దాస్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన చెత్తను ఇక్కడ వేయడం వల్ల స్థానికులకు ఇబ్బందిగా తయారైంది అన్నారు. చాలా దూరం వరకు దుర్వాసన వస్తుందని తెలిపారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ ను ఇక్కడ నుంచి వెంటనే తొలగించాలన్నారు. లేకుంటే స్థానికులు ఉద్యమిస్తారని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు