జాతీయస్థాయి విలువిద్య పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థిని ఎంపిక
09-11-2026 | 06:58pm
కొత్తపల్లి, నవంబర్ 09(విజయక్రాంతి): హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్లో(Hakimpet Sports School) నిర్వహించబడిన ఎస్జిఎఫ్ఐ అండర్ 19 విభాగంలో 03వ తేదీ నుండి 05వ తేదీ వరకు జరిగిన విలువిద్య పోటీలలో అల్ఫోర్స్ విద్యార్ధిని కూన వందన రెండవ స్థానంలో నిలిచింది. అంతే కాకుండ డిసెంబర్ మాసంలో మహారాష్ట్రలోని అమరావతిలో నిర్వహించబడే జాతీయస్థాయి విలువిద్య పోటీలకు కూడ ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మెన్ వి నరేందర్ రెడ్డి అభినందలు తెలిపి, జాతీయస్థాయి పోటీలలో విజయం కూడా సాధించాలని అన్నారు.