ఆలయ కమిటీ చైర్మన్‌గా మేరుగు నరేష్ గౌడ్

16-11-2026 | 03:47pm

ధర్మపురి, నవంబర్ 16 (విజయక్రాంతి): వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీరామ భక్త ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ చైర్మన్‌గా మేరుగు నరేష్ గౌడ్(Merugu Naresh Goud) రెండవసారి కొనసాగనున్నారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో సర్పంచ్ బండమీది కవిత గోపి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామ పెద్దలు, మాజీ ప్రజాప్రతినిధులు, యువకులు ఏకగ్రీవంగా పాత కమిటీనే కొనసాగించాలని నిర్ణయించారు. ఆలయ అభివృద్ధిలో భాగంగా ధ్వజస్తంభం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చైర్మన్ మేరుగు నరేష్ గౌడ్ తెలిపారు. కమిటీ కొనసాగింపునకు సహకరించిన గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు