అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

16-11-2026 | 03:45pm

ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి

ఘట్‌కేసర్ సర్కిల్‌లో 840 మందికి నూతన చేయూత పెన్షన్ మంజూరు ఉత్తర్వుల పంపిణీ

ఘట్ కేసర్, నవంబర్ 16 (విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి(Chief Whip Patnam Mahender Reddy) అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన చేయూత పెన్షన్ల ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమం ఘట్‌కేసర్ పట్టణం, శివారెడ్డి గూడలోని బంధన్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కలెక్టర్ మను చౌదరి, డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలో మొత్తం 840 మందికి నూతనంగా చేయూత పెన్షన్లు మంజూరైనట్లు తెలిపారు. అదేవిధంగా మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో మొత్తం 6,650 మందికి నూతన చేయూత పెన్షన్లు మంజూరు చేయడం హర్షణీయమన్నారు.

ఈ సందర్భంగా వజ్రెష్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పెన్షన్లు అందించి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పాలన అందిస్తోందని, పేదల జీవితాల్లో వెలుగులు నింపుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఘట్ కేసర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ వాణి, తాసిల్దార్ చంద్రశేఖర్, డీసీసీ ఉపాధ్యక్షులు  వేముల మహేష్ గౌడ్, డీసీసీ కార్యదర్శి ముత్యాల్ యాదవ్, మాజీ ఎంపీపీలు బండారి శ్రీనివాస్ గౌడ్, ఏనుగు సుదర్శన్ రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్మెన్ ముల్లి పావని జంగయ్య యాదవ్, ఘట్కేసర్ ఎదులాబాద్, పోచారం నాగారం డివిజన్ల అధ్యక్షులు బొక్క ప్రభాకర్ రెడ్డి, సామల అమర్, కర్రె రాజేష్, భూమయ్య యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బర్ల రాధాకృష్ణ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవరెడ్డి, వినోద్, మాజీ కౌన్సిలర్లు, కొంతం అంజిరెడ్డి, సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు, పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు