TUWJ IJU జిల్లా మహా సభలకు ఆహ్వానం
నిర్మల్ నవంబర్ 16 (విజయక్రాంతి): ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే–ఐజేయూ) నిర్మల్ జిల్లా మహాసభలకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి శ్రీహరి రావు(Congress leader Srihari Rao)కు ఆహ్వాన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లాలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తున్నారని, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని యూనియన్ నాయకులు వివరించారు. అయినప్పటికీ అనేక మంది జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులతో పాటు నివాస సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, చొరవ తీసుకొని జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరారు. ఈ నెల 25న జరిగే జిల్లా మహాసభల్లో జర్నలిస్టుల సమస్యలు, హక్కులు, సంక్షేమం, వృత్తిపరమైన అంశాలపై చర్చించనున్నట్లు నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే–ఐజేయూ జిల్లా అధ్యక్షులు కొండూరు రవీందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంక గారి భూమయ్య,జిల్లా కోశాధికారి వీ. ప్రశాంత్, ఉపాధ్యక్షులు గుమ్ముల అశోక్, వేణుగోపాల్,జిల్లా కార్యదర్శులు జల్ద మనోజ్, హనుమాన్లు, ప్రసాద్,రాజన్న,ఉమేష్ గుప్తా,తదితరులు పాల్గొన్నారు.