ప్రగతి నివేదిక అభివృద్ధికి పలు చర్యలు ప్రారంభం
నాగిరెడ్డిపేట, నవంబర్ 16 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం మల్తుమ్మెదలోని రాష్ట్ర విత్తన క్షేత్రం(State Seed Field) అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఈ విత్తన క్షేత్రంలో సోలార్ పంపు సెట్లు పనులు జరుగుతున్నట్లు మాల్తుమ్మెద విత్తన క్షేత్రం ఏడిఏ ఇంద్రసేన్ తెలిపారు. ఈ విత్తన క్షేత్రానికి మొత్తం 5 సోలార్ పంపు సెట్లు మంజూరయ్యాయనీ, వీటిలో ప్రస్తుతం 2 సెట్లు ఏర్పాటు చేయడం పూర్తయింది.మిగిలిన పంపు సెట్లును ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయనీ ఏడిఏ ఇంద్రసేన్ తెలిపారు. బోరుబావులు విత్తన క్షేత్రంలో నీటి వసతి కోసం 10 బోరుబావులు మంజూరు కాగా,ఇప్పటికే 4 బోరుబావుల తవ్వకం పూర్తయింది.
మిగిలినవి త్వరలో తవ్వనున్నారు.రబీ 2026-27 పంటల ప్రణాళిక సిద్ధం కోసం ఈ రబీ సీజన్‌కు 75 ఎకరాల్లో పంటల సాగు ప్రణాళిక ఆమోదం పొందింది.ఇందులో భాగంగా నవంబర్ నెలలో 25 ఎకరాల్లో కుసుమ (సఫ్లవర్) విత్తనాలు వేస్తామని ఏడిఏ ఇంద్రసేన్ తెలిపారు. మిగిలిన 50 ఎకరాల్లో జనవరి–ఫిబ్రవరి 2027లో 25 ఎకరాల్లో సజ్జ (బాజ్రా), 25 ఎకరాల్లో నువ్వులు (సెసమం) సాగు పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.సోలార్ పంపులు, బోరుబావుల ఏర్పాటుతో సాగునీటి సౌకర్యం మెరుగై, నాణ్యమైన విత్తనోత్పత్తికి క్షేత్రం మరింత సన్నద్ధమవుతుందనీ మాల్ తుమ్మెద విత్తన క్షేత్రం ఏడిఏ ఇంద్రసేన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది ఉన్నారు.