మోత్కుపల్లిలో భూముల డిజిటల్ రీసర్వే

16-11-2026 | 03:42pm

రైతులు పట్టా పాస్‌బుక్కులతో హాజరుకావాలి

రంగరెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి

మొయినాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): మొయినాబాద్ మండలం మోత్కుపల్లి గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసి భూముల డిజిటల్ రీసర్వే చేపడుతున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి(District Additional Collector Kiranmayi) తెలిపారు. సోమవారం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడుతూ రైతుల భూములు, ప్రభుత్వ భూములు, గ్రామకంఠం భూములను సర్వే చేస్తామని పేర్కొన్నారు. రైతులు షెడ్యూల్ ప్రకారం భూములకు సంబంధించిన పత్రాలు, పట్టా పాస్‌బుక్కులతో హాజరుకావాలని సూచించారు.

అనంతరం మండలంలోని ఇతర గ్రామాల్లోనూ సర్వే నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీవో పార్థసింహారెడ్డి, తహసీల్దార్ గౌతమ్ కుమార్, ఎంపీడీవో హిమబిందు, వ్యవసాయ అధికారిణి అనురాధ, సర్పంచ్ సంపూర్ణ రాములు, సర్వే అధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు