గుండంపల్లిలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

17-11-2026 | 07:16pm

మల్లాపూర్, నవంబర్ 17 (విజయక్రాంతి): మల్లాపూర్ మండలం గుండంపల్లి గ్రామంలో(Gundampalli Village) ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు, గ్రామ సర్పంచ్ దప్పుల పద్మనర్సయ్య మంగళవారం ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు తమ ధాన్యాన్ని విక్రయించి లబ్ధి పొందాలని రైతులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు ఏల్లాల జలపతి రెడ్డి, ఏఎంసీ చైర్మన్ అంతడుపుల పుష్పలత నర్సయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాట్ల సోమయ్య, ఏపీఎం విమోచన, సీసీ సంతోష్, ఆర్ఐ అశోక్, ఏఓ లావణ్య, ఎంఎస్ అధ్యక్షురాలు తేజశ్రీ, ఉప సర్పంచ్ జగ్గుల గంగాధర్, పంచాయతీ కార్యదర్శి కవిత,

మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి, దేవయ్య, వీఓ లీడర్లు వనిత, వందన, నర్సు, వీఓఏ నవభారతి, వీడీసీ సభ్యులు గంగాధర్, శేఖర్ రెడ్డి, రాజారెడ్డి, కొమురయ్య, అంజయ్య, మల్లయ్య, విజయ, నరేష్, నవీన్ మోహన్, రాజేందర్, అశోక్, మారుతి, లక్ష్మీనారాయణ, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు