పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లోనే

09-11-2026 | 02:38pm

ఉపాధిహామీ కూలీలకు సర్పంచ్ దోరిశెట్టి మల్లేశం అవగాహన

ధర్మపురి,(విజయక్రాంతి): పిల్లల భవిష్యత్తు(Childrens Future)ను తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని వెల్గటూర్ మండలం రాజక్కపల్లి గ్రామ సర్పంచ్ దోరిశెట్టి మల్లేశం అన్నారు. రాజక్కపల్లి గ్రామం(Rajakkapalli Village)లో ఉపాధిహామీ పథకం(Employment Guarantee Scheme) ద్వారా జరుగుతున్న ఫామ్‌పాండ్ పనులను పరిశీలించిన ఆయన, అక్కడ పనిచేస్తున్న కూలీలతో మాట్లాడి పిల్లల చదువు, పెంపకం, భవిష్యత్తుపై అవగాహన కల్పించారు. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలకు పంపిస్తూ చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు. ఎవరితో తిరుగుతున్నారు, వారి ఖర్చులు ఎలా ఉంటున్నాయనే విషయాలను తల్లిదండ్రులు గమనించాలన్నారు.

గంజాయి, మద్యం వంటి చెడు వ్యసనాలకు పిల్లలు బానిసలు కాకుండా చిన్నప్పటి నుంచే మంచి విలువలు, క్రమశిక్షణ అలవాటు చేయాలని కోరారు. పిల్లలతో ప్రతిరోజూ కొంత సమయం గడిపి వారి సమస్యలను తెలుసుకోవాలని, ప్రేమతో పాటు బాధ్యతను కూడా నేర్పాలని సర్పంచ్‌ మల్లేశం సూచించారు. గ్రామాభివృద్ధి అంటే కేవలం రోడ్లు, డ్రైనేజీలు, ఫామ్‌పాండ్ల నిర్మాణం మాత్రమే కాదని, ప్రతి కుటుంబం అభివృద్ధి చెంది, ప్రతి బిడ్డ మంచి చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగడమే నిజమైన అభివృద్ధి అని అన్నారు. నేటి పిల్లలే రేపటి పౌరులని, వారి భవిష్యత్తును కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు