కాచాపూర్కు ప్రత్యేక పీఏసీఎస్.. రైతుల సంబరాలు
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం(Bhikkanoor mandal) కాచాపూర్ గ్రామానికి ప్రత్యేక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (Primary Agricultural Cooperative Society) ఏర్పాటు కావడంతో గ్రామ రైతులు, కాంగ్రెస్ నాయకులు సంబరాలు నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్(Mohammed Ali Shabbir) ఆధ్వర్యంలో కాచాపూర్ సొసైటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయించినట్లు నాయకులు తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సుమారు 300 మంది రైతులు, మహిళలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని బాణసంచా కాల్చుతూ, వాయిద్యాల నడుమ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ పాలమాకుల జ్యోతి సంతోష్ గౌడ్, ఉప సర్పంచ్ తొగరి దశరథం, మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచులు, పీఏసీఎస్ డైరెక్టర్లు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.