జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కరాటే శిక్షణ తరగతులు ప్రారంభం

09-11-2026 | 02:44pm

రాణి లక్ష్మీ భాయ్ స్వీయ ఆత్మరక్షణలో భాగంగా నిర్వహణ

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం అమ్మాయిల ఆత్మరక్షణ కోసం ప్రభుత్వ పాఠశాలల్లో రాణి లక్ష్మీ భాయ్ స్వీయ ఆత్మ రక్షణ(Rani Lakshmi Bhai Self-Defense) పేరుతో మూడు నెలలపాటు కరాటే శిక్షణ(Karate Training) తరగతులు నిర్వహించనుంది. అందులో భాగముగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించనున్న కరాటే శిక్షణ తరగతులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి ప్రసన్న రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఈ శిక్షణ తరగతులను మూడు వారానికి రెండు రోజులు, నెలకు 12 తరగతుల చొప్పున మూడు నెలలపాటు మాస్టర్ గోసిక అశోక్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాస్టర్ అశోక్ మాట్లాడుతూ శిక్షణలో కరాటే, కిక్ బాక్సింగ్, కర్రసం వాటి వాటితో స్వీయ రక్షణలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు రాజయ్య, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు